హరి హర వీరమల్లు ఫస్ట్ సాంగ్
హరి హర వీరమల్లు చిత్రం నుంచి విజయదశమి సందర్భంగా అద్భుతమైన పోస్టర్ వచ్చింది. త్వరలోనే మొదటి పాట కూడా రాబోతుందని చిత్ర బృందం చెప్పింది. ఇటీవల షూటింగ్ గురించి కొత్త విషయాలు తెలిసాయి. పవన్ కళ్యాణ్ ప్రజా సేవలో బిజీగా ఉన్నా, ఇటీవల షూటింగ్‌లో పాల్గొన్నారు. హాలీవుడ్ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో పెద్ద యుద్ధ సన్నివేశాన్ని తీశారు. ఇందులో పవన్‌తో పాటు 400-500 మంది నటించారు.
అక్టోబర్ 14 నుంచి మళ్లీ షూటింగ్ మొదలవుతుందని, నవంబర్ 10కి పూర్తవుతుందని నిర్మాతలు చెప్పారు. స్వాతంత్ర్యం కోసం పోరాడే యోధుని కథ ఇది. త్వరలోనే ఓ పాట విడుదల కానుంది.
READ ALSO : ఎర్రటి చీరలో అందమైన పాప..!
జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2025 మార్చి 28న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. బాబీ డియోల్ కీలక పాత్రలో, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు భారీగా నిర్మిస్తున్నారు.

0 Comments