డిప్యూటీ సీఎం కి మరో రెండు సినిమాలు సిద్ధం
పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే... ఆయన పవర్ స్టార్ అని అందరికీ తెలుసు కదా! సినిమాల్లోకి వచ్చిన కొత్తలో వరుస హిట్లతో తన మార్క్ చూపించాడు. అన్నయ్య చిరంజీవి పేరు మీద ఎంట్రీ ఇచ్చినా, తర్వాత మాత్రం తన సొంత టాలెంట్‌తో ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నాడు.
ఇప్పుడు పవన్ సినిమాలు అంత బాగా లేకపోయినా, ఒకప్పుడు మాత్రం అవి పెద్ద రేంజ్లో ఉండేవి. వరసగా నాలుగు బ్లాక్బస్టర్లు కొట్టాడు. 'ఖుషి' తర్వాత 'జానీ'తో దర్శకుడిగా కూడా మెప్పించాడు. సినిమా హిట్ కాకపోయినా, టెక్నికల్‌గా బాగా తీశాడని అందరూ అన్నారు.
'జానీ' తర్వాత దాదాపు 10 ఏళ్లపాటు పెద్ద హిట్ లేదు. కానీ 'గబ్బర్ సింగ్'తో మళ్లీ బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఆ సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. ఇన్నేళ్లు హిట్ లేకపోయినా పవన్ రెమ్యునరేషన్ మాత్రం తగ్గలేదు.
Read Also : SSMB29 : ట్విస్టు ఇచినా జక్కన్న?
'అత్తారింటికి దారేది' కూడా పెద్ద హిట్టే. దాంతో త్రివిక్రమ్-పవన్ కాంబో మీద అంచనాలు పెరిగాయి. కానీ వాళ్ల మూడో సినిమా 'అజ్ఞాతవాసి' ఫ్లాప్ అయ్యింది.
దాని తర్వాత కొంతకాలం సినిమాలకి దూరంగా ఉన్న పవన్‌ని త్రివిక్రమే మళ్లీ తీసుకొచ్చాడు. ఇప్పుడు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి, మరో మూడు రెడీ అవుతున్నాయి.
ఇప్పుడు త్రివిక్రమ్ పవన్ కోసం మరో రెండు సినిమాలు సెట్ చేసినట్టు తెలుస్తోంది. ఒకటి రీమేక్, ఇంకొకటి కొత్త కథ అంట. పవన్‌కి ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్న త్రివిక్రమ్, ఇప్పుడు తనే దర్శకత్వం వహించి పవన్‌కి పెద్ద హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు.

0 Comments