Hot Posts

6/recent/ticker-posts

Prabhas and Anushka Shetty New Poster Released

ప్రభాస్, అనుష్క కొత్త పోస్టర్‌. . .

అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఆమె కొత్త సినిమా గురించి సరికొత్త సమాచారం బయటకొచ్చింది. యూవీ క్రియేషన్స్ వాళ్ళు తీస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ బోల్డ్ పోస్టర్ని విడుదల చేశారు.



అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఆమె కొత్త సినిమా గురించి సరికొత్త సమాచారం బయటకొచ్చింది. యూవీ క్రియేషన్స్ వాళ్ళు తీస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ బోల్డ్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో అనుష్క మామూలుగా కాకుండా చాలా విభిన్నంగా కనిపించింది. సిగరెట్టు పొగలో ఆమె ఇంటెన్స్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. 

ఈ పోస్టర్ని చూసిన జనాలు దీన్ని ప్రభాస్ 'రాజా సాబ్' సినిమాలోని ఓ స్టిల్‌తో పోల్చుతున్నారు. రెండింటిలోనూ హీరో హీరోయిన్లు సిగరెట్టు తాగుతూ కనిపించడమే అందుకు కారణం. 'రాజా వారు, రాణి వారు' అంటూ ఈ రెండు పోస్టర్లనీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అనుష్క ఎంత నెమ్మదిగా సినిమాలు చేస్తుందో అందరికీ తెలుసు. 

'బాహుబలి 2' తర్వాత తనకొచ్చిన క్రేజ్‌ని సరిగ్గా వాడుకోలేకపోయింది. 'భాగమతి', 'నిశ్శబ్దం', 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' అనే మూడు సినిమాలు మాత్రమే చేసింది. వాటిల్లో 'నిశ్శబ్దం' పెద్దగా ఆడలేదు. 'భాగమతి' బాగా ఆడగా, 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత అనుష్క సినిమా గురించి ఈ కొత్త సమాచారం వచ్చింది. 

ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్‌తో పాటు సాయంత్రం ఓ చిన్న వీడియో కూడా విడుదల చేయబోతున్నారు. ఆ వీడియో చూసిన తర్వాత ఈ సినిమా గురించి మరింత తెలుస్తుందేమో. ఈ సినిమా కథ ఏంటి? నేపథ్యం ఏంటి? హీరో ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా యూనిట్ నుంచి రావాలి. 

దర్శకుడు క్రిష్ ఈ సినిమాని చాలా రహస్యంగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాతో అనుష్క మరో పెద్ద హిట్ కొడుతుందేమో చూడాలి. క్రిష్‌కి ఈమధ్య కాలం బాగా లేదనిపిస్తోంది. కంగనాతో గొడవ, ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఇబ్బందులు, 'కొండపొలం' సినిమా ఆడకపోవడం, పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా మధ్యలోనే వదిలేయడం, డ్రగ్స్ కేసులు, పబ్ వివాదాలు - ఇలా వరుసగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు.

Post a Comment

0 Comments