Sobhitha : పెళ్లికి ముందే చెప్పేసింది...
![]() |
| photo : Instagram |
శోభిత ధూళిపాళ్ల పేరు విన్నప్పుడే తెలుగు అమ్మాయిలాగే అనిపిస్తుంది కానీ, ఆమె నటన విజయాల తాళం మాత్రం బాలీవుడ్లో మోగుతోంది. అద్భుతమైన కథలను ఎంచుకోవడంతోపాటు, తనదైన నటన శైలితో శోభిత ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అక్కినేని నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత ఈ అమ్మాయి తరచూ వార్తల్లో కనిపిస్తోంది.
మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియన్ సెల్వన్' సినిమా ఫ్రాంచైజీతో శోభిత తన నటన సామర్ధ్యాన్ని జాతీయ స్థాయిలో మరోసారి నిరూపించుకున్నారు. 'పొన్నియన్ సెల్వన్-1' విడుదల కావడానికి రెండు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, చిత్రబృందంతో కలిసి ఆమె సందడి చేశారు. ఈ సందర్భంలో ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది.
![]() |
| Photo : Instagram |
తమిళనాడులో చాలా సంచలనం సృష్టించిన 'పొన్నియిన్ సెల్వన్' నవలను ఆధారంగా చేసుకుని, దర్శకుడు మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఈ సినిమా విజయవంతం కావడంతో, తాజాగా జరిగిన ప్రతిష్టాత్మక ఐఫా అవార్డుల్లో ఘన విజయం సాధించింది. ఉత్తమ నటుడిగా విక్రమ్ అవార్డు అందుకున్నారు, మరియు క్రిటిక్స్ ఛాయిస్ ఉత్తమ నటిగా ఐశ్వర్యారాయ్ నిలిచారు.
ఈ నేపథ్యంలో, చిత్ర యూనిట్ అంతా కలిసి ఫోటోషూట్ నిర్వహించారు. ఈ ఫోటోలను శోభిత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ, "వీరందరూ నా ఎవెంజర్స్, నా పిల్లలకు వీళ్ల గురించి చెప్తాను" అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలో విక్రమ్, జయంరవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిషలతో పాటు శోభితా కూడా ఉన్నారు.
2016లో బాలీవుడ్ విలక్షణ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో 'రామన్ రాఘవ్ 2.0' చిత్రంతో తెరంగ్రేటం చేసిన శోభిత, హిందీ ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు. 2018లో అడివి శేష్ యాక్షన్ స్పై ఫిల్మ్ 'గూఢచారి'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 2022లో వచ్చిన పొన్నియన్ సెల్వన్‌తో మరోసారి జాతీయ గుర్తింపు పొందారు. అదే సమయంలో, వెబ్ సీరీస్లైన 'మేడ్ ఇన్ హెవెన్', 'ది నైట్ మేనేజర్'తో ఓటీటీలోను ఆమె ప్రత్యేక గుర్తింపు సాధించారు.


0 Comments