వరుణ్-సమంతల జోడిపై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
సిటాడెల్ చిత్రంలో వరుణ్ ధావన్, సమంత కలిసి నటించిన విషయం అందరికీ తెలుసు. ఈ చిత్రం లండన్లో ప్రీమియర్ అయ్యింది. ఆ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరైంది. సిటాడెల్ ఇటలీ వెర్షన్ బృందం కూడా ఉంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ గినా గార్డి మాట్లాడారు. ఆమె సిటాడెల్ భారత వెర్షన్ను కూడా చూశానని చెప్పారు. సమంత, వరుణ్ జంటగా అద్భుతంగా నటించారని ఆమె పొగడ్తల వర్షం కురిపించారు.
Also Read : ప్రభాస్ మూవీలో మరో 'లెజెండ్'
వాళ్ళ జోడీ బాగా సరిపెట్టుకున్నట్లు అనిపించింది, నేను నిజంగా ఆశ్చర్యపోయాను. మొదటి ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్లీ మళ్లీ చూశాను.. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ చాలా బావుందని అనిపించింది. వాళ్ళు నటించిన పాత్రల్లో ఎవరూ ఊహించని మలుపులు ఉన్నాయి. అదే సమయంలో, రాజ్ అండ్ డీకేలను నాకు చాలా ఇష్టం. వాళ్ళ సినిమాలు చూసినప్పుడల్లా కొత్తగా అనిపిస్తాయి. వాళ్లు తెరకెక్కించిన ఏ చిత్రమైనా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. సిటాడెల్ గ్లోబల్ ఈవెంట్లో చిత్రబృందాన్ని కలవడం చాలా సంతోషంగా ఉంది.

0 Comments