Hot Posts

6/recent/ticker-posts

Meenakshi Chowdary photo stills viral @gullynewstelgu

గురూజీ హీరోయిన్‌ స్టిల్స్ వైరల్

ఇప్పుడు మీనాక్షికి మరో పెద్ద ఛాన్స్ దొరికినట్టుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. వశిష్ట మల్లిడి తీస్తున్న విశ్వంభర సినిమాలో దేవకన్యలా కనిపించబోతుందని తెలుస్తోంది.

ఏమైనా మీనాక్షి చౌదరి గురించి మాట్లాడుకోవాలంటే ఒక్క గుంటూరు కారం సినిమా చాలు. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబో సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించినా, ఆ పాత్రతో జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ఇప్పుడు మీనాక్షికి మరో పెద్ద ఛాన్స్ దొరికినట్టుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. వశిష్ట మల్లిడి తీస్తున్న విశ్వంభర సినిమాలో దేవకన్యలా కనిపించబోతుందని తెలుస్తోంది. 

అంతేకాదు, దుల్కర్ సల్మాన్‌తో పాన్ ఇండియా సినిమా, దళపతి విజయ్ సినిమా, వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబో సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇటీవలే వచ్చిన లక్కీ భాస్కర్ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది.

సోషల్ మీడియాలో కూడా మీనాక్షి క్రేజ్ పీక్స్‌లో ఉంది. లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలతో అభిమానుల్ని ఫిదా చేస్తోంది. స్టైలిష్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. "స్వర్గం నుంచి దిగొచ్చిన దేవకన్య లాగా ఉన్నావు" అని కొందరు కామెంట్లు పెడుతుంటే, "త్రివిక్రమ్ చేతిలో పడితే ఏ హీరోయిన్ అయినా స్టార్ అయిపోతుంది" అని మరికొందరు అంటున్నారు.

Post a Comment

0 Comments